abortion (telugu) according to Quran
Mohammed Suleman (rammohanreddy)
అవూజుబిల్లాహి మినిశైతాన్ నిర్రజీం
(శాపగ్రస్తుడైన షైతాన్ బారినుండి, ఒకేఒక్క సృష్టికర్త ఐన అల్లాహ్ శరణు వెడుతున్నాను)
బిస్మిల్లా హిర్హ్మాన్ నిర్రహీం
(నేను ఈ కార్యాన్ని సృష్టికర్త ఐన అల్లాహ్ పేరుతో ప్రారంబిస్తున్నాను)
పిల్లలను కనడం
సృష్టి
పోషణ
అబార్షన్
దైవగ్రంతాలలో
కల్చర్
45. సూరా అల్ జాసియ హ్
45:6 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ
45:6 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ
ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్టుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు(ట)!?
7. సూరా అల్ ఆరాఫ్
7:185 أَوَلَمْ
يَنظُرُوا فِي مَلَكُوتِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا خَلَقَ اللَّهُ مِن
شَيْءٍ وَأَنْ عَسَىٰ أَن يَكُونَ قَدِ اقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَيِّ حَدِيثٍ
بَعْدَهُ يُؤْمِنُونَ
ఏమిటి, ఆకాశాల మరియు భూమి యొక్క వ్యవస్థను, అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులను వారు గమనించలేదా? వారి కాలం దగ్గరపడి ఉండవచ్చునన్న సంగతిని గురించి కూడా వారు ఆలోచించలేదా? మరి ఖుర్‌ఆన్ తరువాత, వారు విశ్వసించే ఇంకొక వస్తువు ఏముంటుంది?
39. సూరా అజ్ జుమర్
39:23 اللَّهُ
نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُّتَشَابِهًا مَّثَانِيَ تَقْشَعِرُّ
مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ
وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن
يَشَاءُ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదేపదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దాని వల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్ స్మరణపట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు.
77. సూరా అల్ ముర్సలాత్
77:50 فَبِأَيِّ
حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
ఇక ఈ (ఖుర్ఆన్) విషయం తరువాత వారు విశ్వసించటానికి ఏం ఉంది(ట)?
6. సూరా అల్ అన్ ఆమ్
6:114 أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
6:114 أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
ఏమిటీ, నేను అల్లాహ్ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.
12. సూరా యూసుఫ్
12:111 لَقَدْ كَانَ
فِي قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُولِي الْأَلْبَابِ ۗ مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ
وَلَٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلِّ شَيْءٍ وَهُدًى
وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
నిశ్చయంగా వీరి (ఈ జాతుల) గాథలలో విజ్ఞతగల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖుర్‌ఆన్ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.
6. సూరా అల్ అన్ ఆమ్
6:38 وَمَا مِن
دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ
أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ
رَبِّهِمْ يُحْشَرُونَ
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా - అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే.
16. సూరా అన్ నహ్ల్
16:89 وَيَوْمَ
نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا
بِكَ شَهِيدًا عَلَىٰ هَٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا
لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచీ వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి (ఓ ప్రవక్తా!) నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి (ముస్లింలకు) అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త.
7. సూరా అల్ ఆరాఫ్
المص
అలిఫ్ - లామ్ - మీమ్ - సాద్.
7:2 كِتَابٌ
أُنزِلَ إِلَيْكَ فَلَا يَكُن فِي صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنذِرَ بِهِ
وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ
ఇదొక గ్రంథం. దీని ఆధారంగా నీవు హెచ్చరించటానికిగాను ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి (ఓ ప్రవక్తా!) దీని పట్ల నీ మనసులో ఎటువంటి సంకోచం ఉండకూడదు. విశ్వసించిన వారికి ఇది హితబోధిని (జ్ఞాపిక!).
7:3 اتَّبِعُوا مَا
أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ
قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
quran says do not kill children
17. సూరా బనీ ఇస్రాయీల్
17:30 إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
17:30 إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు. తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నవాడు.
17:31 وَلَا
تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ
ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం.
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం.
6. సూరా అల్ అన్ ఆమ్
6:135 قُلْ يَا
قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن
تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
ఓ ప్రవక్తా! వారికి ఇలా చెప్పు : “ఓ నా జాతి ప్రజలారా! మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.'
6:136 وَجَعَلُوا
لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا
لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ
فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ
شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్థారించారు. పైపెచ్చు “ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం” అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్థారించిన భాగం అల్లాహ్కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్థారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది!?
6:137 وَكَذَٰلِكَ
زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ
لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّهُ مَا
فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు, వారిని నాశనం చేయడానికీ, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారినీ, వారు కల్పించే కల్పనలనూ వదిలెయ్యి.
7. సూరా అల్ ఆరాఫ్
7:140 قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ
7:140 قَالَ أَغَيْرَ اللَّهِ أَبْغِيكُمْ إِلَٰهًا وَهُوَ فَضَّلَكُمْ عَلَى الْعَالَمِينَ
“ఏమిటీ, అల్లాహ్ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నాడు” అని కూడా మూసా (అలైహిస్సలాం) అన్నాడు.
7:141 وَإِذْ
أَنجَيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ ۖ
يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ
مِّن رَّبِّكُمْ عَظِيمٌ
మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి - వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేసి, మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్ష ఉండింది.
28. సూరా అల్ ఖసస్
28:4 إِنَّ
فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ
طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ
كَانَ مِنَ الْمُفْسِدِينَ
నిజంగానే ఫిరౌను భువిలో (ఈజిప్టు రాజ్యంలో) చెలరేగి పోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగ పిల్లలను చంపేసి, వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతక నిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించినవారి కోవకు చెందినవాడు.
60. సూరా అల్ ముమ్ తహిన హ్
60:12 يَا أَيُّهَا النَّبِيُّ إِذَا جَاءَكَ الْمُؤْمِنَاتُ يُبَايِعْنَكَ عَلَىٰ أَن لَّا يُشْرِكْنَ بِاللَّهِ شَيْئًا وَلَا يَسْرِقْنَ وَلَا يَزْنِينَ وَلَا يَقْتُلْنَ أَوْلَادَهُنَّ وَلَا يَأْتِينَ بِبُهْتَانٍ يَفْتَرِينَهُ بَيْنَ أَيْدِيهِنَّ وَأَرْجُلِهِنَّ وَلَا يَعْصِينَكَ فِي مَعْرُوفٍ ۙ فَبَايِعْهُنَّ وَاسْتَغْفِرْ لَهُنَّ اللَّهَ ۖ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు. వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.
60:13 يَا أَيُّهَا
الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ قَدْ
يَئِسُوا مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడిఉన్న వారిపట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు.
6. సూరా అల్ అన్ ఆమ్
6:151 قُلْ
تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا
ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ
ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ
مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ
إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా - వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.
6:140 قَدْ خَسِرَ
الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا
رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا
مُهْتَدِينَ
మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు.
3. సూరా ఆలి ఇమ్రాన్
3:140 إِن
يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ
الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا
وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. (ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే) మీలో (నికార్సయిన) విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి 'షహాదత్' (వీర మరణ) స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరామూ ఇష్టపడడు.
26. సూరా ఆష్ షుఅరా
26:19 وَفَعَلْتَ
فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ
"ఆ తరువాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు. మొత్తానికి చేసిన మేలును మరచిన వారిలో నువ్వూ ఒకడివి."
2. సూరా అల్ బఖర
2:49 وَإِذْ
نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ
أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن
رَّبِّكُمْ عَظِيمٌ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి) ఫిరౌను మనుషుల బారి నుండి మేము మీకు విముక్తి నొసగాము. వారు మిమ్మల్ని దారుణంగా వేధించేవారు. మీ కొడుకులను చంపివేసి, కూతుళ్ళను మాత్రం విడిచి పెట్టేవాళ్ళు. ఈ విముక్తి నొసగటంలో మీ ప్రభువు తరఫునుండి మీకు గొప్ప పరీక్ష ఉండినది.
21. సూరా అల్ అంబియా
21:26 وَقَالُوا
اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۚ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ
కరుణామయునికి సంతానం ఉందని వారు (ముష్రిక్కులు) చెబుతున్నారు. (ఇది నిజం కాదు) ఆయన పవిత్రుడు. పైగా వారంతా (దైవదూతలంతా) గౌరవించబడిన ఆయన దాసులు.
5. సూరా అల్ మాయిద
5:32 مِنْ أَجْلِ
ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ
نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ
أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ
رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي
الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
19. సూరా మర్యం
68. సూరా అల్ ఖలమ్
68:8 فَلَا تُطِعِ
الْمُكَذِّبِينَ
కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు.
నువ్వు కాస్త మెత్తబడితే, తాము కూడా మెతకవైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు.
నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు.
– వాడు (ఎంతసేపటికీ) చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు.
మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు.
68:13 عُتُلٍّ بَعْدَ
ذَٰلِكَ زَنِيمٍ
మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు.
ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరిసంపదలు, పుత్ర సంతానం ఉండటమే. (కాబట్టి నువ్వు అతణ్ణి అనుసరించకు).
వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు, “ఇవి పూర్వీకుల కట్టు కథలంటూ” తేలిగ్గా కొట్టిపారేస్తాడు.
ఇక మేము త్వరలోనే వాడి తొండం (ముక్కు)పై వాత వేస్తాము.
5. సూరా అల్ మాయిద
5:110 إِذْ قَالَ
اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ
وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ
وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ
وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي
فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ
وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ
كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ
الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, 'ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు' అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
10. సూరా యూనుస్
10:90 وَجَاوَزْنَا
بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُودُهُ بَغْيًا
وَعَدْوًا ۖ حَتَّىٰ إِذَا أَدْرَكَهُ الْغَرَقُ قَالَ آمَنتُ أَنَّهُ لَا إِلَٰهَ
إِلَّا الَّذِي آمَنَتْ بِهِ بَنُو إِسْرَائِيلَ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ
మేము ఇస్రాయీలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరౌను తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి, అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా (సముద్రంలో) మునిగిపోతున్నప్పుడు; ''బనీఇస్రాయీల్ విశ్వసించిన దేవుణ్ణి నేనూ విశ్వసిస్తున్నాను. ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నేనూ ముస్లింలలోని వాడనే'' అని ఫిరౌను పలికాడు.
23. సూరా అల్ మూ ‘మినూన్
23:51 يَا أَيُّهَا
الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا
تَعْمَلُونَ عَلِيمٌ
ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.
నిశ్చయంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి.
అయితే వారంతట వారే (విభేదించుకుని), తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది.
కనుక నువ్వు (కూడా) వాళ్ళను వాళ్ళ ఏమరుపాటులో కొంత కాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు.
సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు?
తమకు మేళ్లు చేయటంలో మేము వేగిరపడ్తున్నామని వారు తలపోస్తున్నారా?! (లేదు లేదు) వారసలు (యదార్థాన్ని) గ్రహించటం లేదు.
నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో,
మరెవరు తమ ప్రభువు ఆయతులను విశ్వసిస్తున్నారో,
ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో,
ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో,
వారే త్వరత్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతున్న వారు. వాటికోసం వారు పోటీపడతారు.
23:62 وَلَا
نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَابٌ يَنطِقُ بِالْحَقِّ ۚ
وَهُمْ لَا يُظْلَمُونَ
మేము ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయము. మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
23:63 بَلْ
قُلُوبُهُمْ فِي غَمْرَةٍ مِّنْ هَٰذَا وَلَهُمْ أَعْمَالٌ مِّن دُونِ ذَٰلِكَ
هُمْ لَهَا عَامِلُونَ
పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి గాకుండా వారు చేసే మరెన్నో (చెడు) చేష్టలుకూడా ఉన్నాయి.
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.
ఈ రోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయమూ పొందలేరు.
(ఒకప్పుడు) నా ఆయతులు మీకు చదివి వినిపించబడేవి. అయినా మీరు కాలి మడమలపైన వెనుతిరిగి పోయేవారు (కదా)!
గర్విష్టుల్లా ప్రవర్తించేవారు. కల్లబొల్లి కబుర్లు చెప్పుకుని, దాన్ని (ఖుర్ఆన్ను) వదిలిపోయేవారు (అని వారితో అనబడుతుంది).
ఏమిటీ, వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాతముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుకా? (ఈ మంకుతనం?)
లేక తమ సందేశహరుణ్ణి ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా?
లేక అతనికి పిచ్చిపట్టిందని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలే పడదు.
23:71 وَلَوِ
اتَّبَعَ الْحَقُّ أَهْوَاءَهُمْ لَفَسَدَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَمَن
فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَاهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ
సత్యమే గనక వారి కోర్కెల వెనుక పరుగెత్తినట్లయితే భూమ్యాకాశాలు, అందులో వున్న సమస్తం చిందరవందర అయిపోయేవి. యదార్థమేమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము. కాని వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు.
పోనీ, నువ్వు వారినుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.
అయితే పరలోకంపై నమ్మకం లేనివారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు.
allah gives life and death
22. సూరా అల్ హజ్
22:66 وَهُوَ الَّذِي
أَحْيَاكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۗ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ
మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే. మరి ఆయనే మీకు మరణం వొసగుతాడు. మళ్లీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే.
16. సూరా అన్ నహ్ల్
16:70 وَاللَّهُ
خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ
الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ
قَدِيرٌ
అల్లాహ్యే మిమ్మల్నందరినీ పుట్టించాడు. మరి ఆయనే మీకు చావునిస్తాడు. మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు-అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి! నిస్సందేహంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వాధికారి.
3. సూరా ఆలి ఇమ్రాన్
3:156 يَا أَيُّهَا
الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ
إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا
مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ
وَاللَّهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఓ విశ్వసించిన వారలారా! మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు, తమ సోదరులు ప్రయాణంలోనో, యుద్ధంలోనో ఉన్నప్పుడు, ''ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు'' అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్ తమ హృదయశోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు.
23. సూరా అల్ మూ ‘మినూన్
23:78 وَهُوَ الَّذِي
أَنشَأَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا
تَشْكُرُونَ
ఆయనే (అల్లాహ్యే) మీకు చెవులను, కళ్లను, హృదయాలను చేశాడు. కాని మీరు కృతజ్ఞతలు తెలిపేది బహుతక్కువ.
మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసినవాడు కూడా ఆయనే. ఎట్టకేలకు ఆయన వద్దకే మీరు సమీకరించబడతారు.
23:80 وَهُوَ الَّذِي
يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ ۚ أَفَلَا
تَعْقِلُونَ
జీవన్మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. రేయింబవళ్ళ మార్పిడి కూడా ఆయన అధీనంలోనే ఉంది. మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా?
57. సూరా అల్ హదీద్
سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ
الْعَزِيزُ الْحَكِيمُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి.
57:2 لَهُ مُلْكُ
السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ
قَدِيرٌ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు.
57:3 هُوَ
الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు.
10. సూరా యూనుస్
10:56 هُوَ يُحْيِي
وَيُمِيتُ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఆయనే ప్రాణం పోస్తాడు, మరి ఆయనే ప్రాణం తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.
53. సూరా అన్ నజ్మ్
53:42 وَأَنَّ إِلَىٰ
رَبِّكَ الْمُنتَهَىٰ
కడకు అందరూ పోయి చేరవలసింది నీ ప్రభువు వద్దకే.
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు.
మరి ఆయనే చంపుతున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు.
40. సూరా అల్ మూమిన్
40:67 هُوَ الَّذِي
خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ
يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا
ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُّسَمًّى
وَلَعَلَّكُمْ تَعْقِلُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో (తల్లి గర్భం నుంచి) బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్తవయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు, ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు (గడువు ఇస్తున్నాడు). మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి (వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు).
40:68 هُوَ الَّذِي
يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن
فَيَكُونُ
జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని వొసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, దాన్నుద్దేశించి 'అయిపో' అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది.
67. సూరా అల్ ముల్క్
تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ
قَدِيرٌ
ఎవరి చేతిలో విశ్వసామ్రాజ్యాధికారం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.
67:2 الَّذِي خَلَقَ
الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ
الْعَزِيزُ الْغَفُورُ
మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.
56. సూరా వాఖియహ్
56:60 نَحْنُ
قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
మేమే మీ కోసం మరణం నిర్ణయించాం మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
3. సూరా ఆలి ఇమ్రాన్
3:145 وَمَا كَانَ
لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن
يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ
نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ
దైవాజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు. నిర్థారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వొసగుతాము.
39. సూరా అజ్ జుమర్
39:42 اللَّهُ
يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا وَالَّتِي لَمْ تَمُتْ فِي مَنَامِهَا ۖ
فَيُمْسِكُ الَّتِي قَضَىٰ عَلَيْهَا الْمَوْتَ وَيُرْسِلُ الْأُخْرَىٰ إِلَىٰ
أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
అల్లాహ్యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
35. సూరా ఫాతిర్
35:11 وَاللَّهُ
خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ أَزْوَاجًا ۚ وَمَا
تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَمَا يُعَمَّرُ مِن
مُّعَمَّرٍ وَلَا يُنقَصُ مِنْ عُمُرِهِ إِلَّا فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى
اللَّهِ يَسِيرٌ
(ప్రజలారా!) అల్లాహ్ మిమ్మల్ని మట్టితో, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు (స్త్రీలు, పురుషులు)గా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటంగానీ, బిడ్డను కనటంగానీ జరగదు. దీర్ఘాయుషు పొందినవాని ఆయుష్షు పెరగటమైనా, మరొకతని ఆయుష్షు తరగటమైనా - అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాహ్కు చాలా తేలిక.
6. సూరా అల్ అన్ ఆమ్
6:98 وَهُوَ الَّذِي
أَنشَأَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ
فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము.
31. సూరా లుక్మాన్
31:34 إِنَّ اللَّهَ
عِندَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثَ وَيَعْلَمُ مَا فِي الْأَرْحَامِ
ۖ وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ
أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు. అల్లాహ్యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి).
44. సూరా అద్ దుఖాన్
44:8 لَا إِلَٰهَ
إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు.
7. సూరా అల్ ఆరాఫ్
7:158 قُلْ يَا أَيُّهَا
النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ
السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ
بِاللَّهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే బ్రతికించేవాడు, ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. కనుక అల్లాహ్ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి - ఆ ప్రవక్త అల్లాహ్ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు.”
9. సూరా అత్ తౌబా
9:116 إِنَّ اللَّهَ
لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۚ وَمَا لَكُم مِّن
دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
నిస్సందేహంగా భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్దే. జీవింపజేసేదీ, మరణాన్ని ప్రసాదించేదీ ఆయనే. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడుగానీ, సహాయకుడుగానీ లేడు.
10. సూరా యూనుస్
10:104 قُلْ يَا
أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي شَكٍّ مِّن دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ
تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَلَٰكِنْ أَعْبُدُ اللَّهَ الَّذِي يَتَوَفَّاكُمْ
ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
(ప్రవక్తా!) వారికి చెప్పు: "ప్రజలారా! నాధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్ను వదలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించేవారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది."
2. సూరా అల్ బఖర
2:258 أَلَمْ تَرَ
إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ
إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي
وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ
الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ
لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
25:1 تَبَارَكَ
الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.
25:2 الَّذِي لَهُ
مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ
شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا
భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి, దానికి తగ్గట్టుగా - దాని లెక్కను నిర్థారించాడు.
25:3 وَاتَّخَذُوا
مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا
يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا
حَيَاةً وَلَا نُشُورًا
వారు అల్లాహ్ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి
20. సూరా తాహా
20:55 مِنْهَا
خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.
80. సూరా అబస
80:17 قُتِلَ
الْإِنسَانُ مَا أَكْفَرَهُ
మనిషి నాశనం గాను! ఎటువంటి కృతఘ్నుడు వాడు?!
(అల్లాహ్) వాణ్ణి దేంతో పుట్టించాడు?
ఒక్క వీర్య బిందువుతో (నే కదా!) పుట్టించాడు. మరి అతనికి (కావలసినవి) తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు.
ఆపైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు.
అటుపిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తరువాత అతణ్ణి సమాధిలోనికి చేర్చాడు.
మరి తాను కోరినప్పుడు అతణ్ణి బ్రతికించి లేపుతాడు.
సోషల్ ప్రోబ్లమ్స్
సిగరెట్, గుటక, అల్కొహాల్, డ్రస్ (వస్త్రదారణ), వ్యాపారంలో మోసం etc….
సోసల్ ఇస్స్యూస్
https://www.youtube.com/channel/UCEdWQsJQVEQxsOpCI6jzuVw
MOHAMMED SULEMAN FB
https://www.facebook.com/Allah.Telugu
https://www.facebook.com/QURAN.FREE/?ref=bookmarks
https://www.facebook.com/sulemanreddy/?ref=bookmarks
https://www.facebook.com/obaidullah.co/?ref=bookmarks
http://samidirecthyd.blogspot.in
http://samidirecthyd.blogspot.in/p/telugu-islam-mohammed-suleman.html
http://samidirecthyd.blogspot.in/p/shaik-obaidullah-faizi.html
https://plus.google.com/u/0/+islamMuslimislamiccenter
No comments:
Post a Comment